తమ్ముడిదే పైచేయి
ప్రజాశక్తి-గొల్లప్రోలు : గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య జరిగిన పోరు స్థానికంగా ఆసక్తిని కలిగించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రత్యర్థులుగా బరిలోకి దిగడంతో ఈ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించింది. 15వ వార్డు నుంచి జరిగిన ఈ పోటీలో అన్న రంధి కృష్ణపై తమ్ముడు రంధి శ్రీనివాసరావు విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో తమ్ముడు రంధి శ్రీనివాసరావుకు 432 ఓట్లు రాగా, అన్న రంధి కృష్ణకు 267 ఓట్లు పోలయ్యాయి. దీంతో 165 ఓట్ల మెజారిటీతో రంధి శ్రీనివాసరావు గెలుపొందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలవడం, తమ్ముడు అన్నపై విజయం సాధించడం గొల్లప్రోలులో చర్చనీయాంశంగా మారింది.








కామెంట్‌లు (0)