మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Murasu Cyclone : పలు జిల్లాల్లో భారీ వర్షాలు

1 గంట క్రితం

andhra pradesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : మురసు తుపాను ప్రభావంతో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వాగులు పొంగిపొర్లే అవకాశముందని, దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. దక్షిణకోస్తాంధ్రపై మురసు తుపాను ప్రభావం అధికంగా ఉందన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిమీ వేగంతో కదులుతోందని, ప్రస్తుతం బాపట్లకు 40కి.మీ, ఒంగోలుకు 50, విజయవాడకు 90, కావలికి 110, మచిలీపట్నంకు 120కి.మీ దూరంలో ఉందన్నారు. మురసు క్రమంగా తుపాను, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశముందన్నారు. మంగళవారం రాత్రి నుండి ఈదురుగాలులు తగ్గే అవకాశముందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్