మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పీలేరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

1 గంట క్రితం

annamayya.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

* ఉదయం మందకొడిగా.. మూడు గంటల తర్వాత ఓటర్ల సందడి

* మధ్యాహ్నం వరకు 225 మందే ఓటు.. ఆ తర్వాత పెరిగిన రద్దీ


ప్రజాశక్తి-పీలేరు: పీలేరు మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం నుంచి నెమ్మదిగా సాగిన పోలింగ్‌లో మధ్యాహ్నం వరకు కేవలం 225 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి ఓటర్ల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల విధులకు హాజరుకానున్న ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, పీలేరు పరిసర మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పోలింగ్ కేంద్రం సందడిగా మారింది. దీంతో పీలేరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఓటర్లతో కిటకిటలాడింది.

పోలింగ్ ప్రక్రియను మండల రిటర్నింగ్ అధికారి డాక్టర్ జి. శ్రీనివాస నాయుడు పర్యవేక్షించారు. సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవో శివశంకర్, తహశీల్దార్ శివకుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు లోకేష్, రమణతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్