ప్రజాశక్తి - జగ్గంపేట : ముసురు తుఫాను ప్రభావంతో మండలంలో 393 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. జగ్గంపేట మండలంలోని రామవరం, కాట్రావులపల్లి, సీతానగరం, జగ్గంపేట, జె కొత్తూరు, మల్లిశాల, గొల్లలగుంట, కాండ్రేగుల, నరేంద్రపట్నం గ్రామాల్లో 383 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మిగిలిన పంటలు నేలకొరిగాయి. ఆ పంటలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు జి.శ్రీనివాస్, మార్టేరు శాస్త్రవేత్తలతో మంగళవారం పరిశీలించారు. తుఫాను నేపద్యంలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.
393 హెక్టార్లలో పంట నష్టం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 03:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)