ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : ఇటీవల తుఫానుకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పల్లంరాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజాదరణ పొందుతుందన్నారు. పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. జగ్గంపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా చంద్రమౌళి వెంకటరత్నం పోటీచేస్తున్నారని ఆయనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి చిట్టిబాబు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ మారోతి శివ గణేష్, ఎపిసిసి సభ్యులు ప్రసాద్, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.
తుఫాను నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి - మాజీ మంత్రి పల్లంరాజు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)