మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రక్షిత తాగునీటి పథకం ఆధునీకరణకు డిప్యూటి సిఎం పవన్ శంకుస్థాపన

1 గంట క్రితం

Deputy CM Pawan lays foundation stone for modernization of protected drinking water scheme.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి (కాకినాడ) : యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం ఆధునీకరణ పనులకు మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్‌కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ .... రూ.9.59 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ఆధునీకరణ పనులతో మండలంలోని ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుందన్నారు. ముఖ్యంగా శివారు గ్రామాలకు సైతం నిరంతరాయంగా తాగునీరు అందేలా పథకాన్ని ఆధునీకరించనున్నారు అని జనసేన నాయకులు తెలుపుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా తాగునీటి సమస్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న పవన్‌కల్యాణ్‌ తాగునీటి సమస్య పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. నాగులపల్లి రక్షిత తాగునీటి పథకం ఆధునీకరణతో మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయన్నారు. నాగులపల్లి రక్షిత మంచినీటి పథకంలో అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి, నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్నారని అన్నారు. శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు అవకాశం ఏర్పడనుందని తెలిపారు. 57 ఆవాసాలకు 97 వేల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులను నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రావు అక్షయ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ గాయత్రిదేవి, చీఫ్‌ ఇంజనీర్‌ హరి రామ్‌ నాయక్‌, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Deputy CM Pawan lays foundation stone for modernization of protected drinking water scheme.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్