ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : మండల కేంద్రమైన గండేపల్లిలో జాతీయ రహదారి పక్కనే మంగళవారం ఉదయం విద్యుత్ షాక్ తో పెంపుడు కుక్క మృతి చెందగా పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బత్తిన నాగదేవి ఇంట్లో పోస్ట్ ఆఫీస్ గల ఇంట్లో ఇంటికి కరెంటు షార్ట్ సర్క్యూట్ తగిలి ఇల్లంతా కరెంట్ వ్యాపించి ఇంటికి కాపులా గా ఉన్న కుక్క మృతి చెందింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. ఉదయం ఇంటికి గలవారు వచ్చి తలుపు తీద్దామనేసరికి కరెంటు షాక్ కొట్టడంతో మహిళ కు తగిలి ఆమె పడిపోయింది. అయితే ఇంటి పైనుంచి ప్రక్కన ఉన్న ట్రాన్స్ఫారం నుంచి వైర్లు వెళ్లడంతో విద్యుత్ అధికారులు సరైన జాగ్రత్తలు పాటించకుండా వైర్లు నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్తు అధికారులు అప్రమత్తంతో వ్యవహరించి తగు జాగ్రత్తలు పాటించి విద్యుత్ వైర్లు నడిపించాలని కోరుతున్నారు.
ఇంటికి పాకిన కరెంటు - షాక్ తగిలి పెంపుడు కుక్క మృతి
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)