శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చివరి మజిలీలోను దళితులకు తప్పని అవస్థలు ...

1 గంట క్రితం

Hardships are unavoidable for Dalits even in their final journey...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మృతదేహంతో తాండవ ఏరును దాటతున్న దళితులు.


ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) :  ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ దళితులకు అవస్థలు తప్పట్లేదని అల్లిపూడి గ్రామ దళితులు ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం దళితులు మాట్లాడుతూ ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల ప్రసారంలో దళితులకు స్మశానవాటిక ,వంతెనను నిర్మాణం చేపడతామని దళితులకు హామీ ఇచ్చినప్పటికీ అవి కేవలం నీటి మాటలుగానే మిగిలిపోతున్నాయని దళితులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. దళితవాడలను ఆనుకొని తాండవ  రిజర్వాయర్  ఏరును  ఉంటుంది. ఒకటవ ఎస్సి కాలనీ తాండవ రిజర్వాయర్  ఏరు ఇవతల ,రెండవ ఎస్సీ కాలనీ తాండవ రిజర్వేరు ఏరు ఇవతల ఉంది. సుమారు 1950 మందికి పైగా దళితులు ఉన్నారు.  దళిత కాలనీలో చనిపోయినవారిని తాండవ రిజర్వాయర్ ఏరులో నుండి శవాన్ని  మూసుకుంటూ దాటివెళ్లి ఏటి ఒడ్డున శవాన్ని పూడ్చి పెడతారు. స్మశానవాటికల అభివృద్ధికి ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు దళిత స్మశాన వాటికలకు కేటాయించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అల్లిపూడి దళిత వాసులకు స్మశాన వాటికను నిర్మించి సమస్య నుంచి విముక్తి కలిగించాలని పలువురు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్