ప్రజాశక్తి - రౌతులపూడి : మండలంలోని జల్దం గ్రామపంచాయతీ చాకిరేవుపాలెం లో గల పాఠశాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పనా వంటి విషయాలను పరిశీలించిన ఆయన వ్యక్తిగత మరుగుదొడ్ల శిధిలమ్మ అవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ తాసిల్దార్ ఎస్ వి నరేష్ ఆదేశించారు. పాఠశాలకు సంబంధించిన వారి విషయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.
పాఠశాల పరిశీలించిన జాయింట్ కలెక్టర్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)