గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్ల భారీ ఆందోళన

2 రోజుల క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్ల భారీ ఆందోళన చేపట్టారు. మంగళవారం కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్. గోవిందరావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నమ్ముకుని వేలాది మంది లేఖర్లు, స్టాంప్ వెండర్లు, వారి కుటుంబాలు జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేట్ సంస్థలకు లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ​ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలపై సేవా రుసుముల (సర్వీస్ చార్జీలు) భారం విపరీతంగా పెరుగుతుందని, భూముల కొనుగోలు, అమ్మకాలు సామాన్యుడికి భారం అవుతాయని హెచ్చరించారు.

డేటా భద్రతకు ముప్పు: అత్యంత కీలకమైన భూముల రికార్డులు, ప్రజల వ్యక్తిగత దస్తావేజుల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ఇది శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాకినాడ జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల బంద్ నిర్వహించడంతో పాటు, నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రతినిధులు స్పష్టం చేశారు.​ ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బి.జె. ప్రసాద్, సిహెచ్. గోవిందు, పారుపూడి ప్రసాదరావు, ధూళిపూడి సతీష్, జాడ అప్పలరాజు యాదవ్, గేసాల శీను, బి.వి.వి. సత్తిబాబు, డీకే మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్