శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నబ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు : అదనపు కమిషనర్

27 అక్టోబర్, 2026

Robust measures in place to tackle Cyclone Arnab Additional Commissioner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత మండలాల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సమీక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, అర్బన్ తహసీల్దార్ వి. జితేంద్ర, డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ.. అర్నబ్ తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కాకినాడ నగరపాలక సంస్థతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నగరంలోని పునరావాస కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలు, ఆయా కేంద్రాల్లో తీసుకున్న జాగ్రత్తలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, సెక్రటరీ లక్ష్మి, డిసిపి కెవి కృష్ణారావు,ఈఈ కనకారావు, టీపీఆర్వో సతీష్ బాబు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు , మేనేజర్ శిరీష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్