బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేయూత సంస్థ సేవా ప్రస్తానం అద్వితీయం

12 సెప్టెంబర్, 2026

kakinada.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 01:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : మానవత్వమే మతంగా, సేవే లక్ష్యంగా 2017లో ప్రారంభమైన చేయూత చారిటబుల్ సొసైటీ విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వార్షికోత్సవ వేడుకలను కాకినాడ రూరల్ పెనుగుదురులోని ఒక ఫంక్షన్ హాలులో శనివారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆర్జెడి నాగమణి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరా బత్తుల రాజశేఖరం ముఖ్య అతిథులుగా హాజరై సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎం. రవికుమార్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా వేలాది మంది దాతలు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషుల సహకారంతో సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించగలిగిందని తెలిపారు. సంస్థ ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి మాట్లాడుతూ, చేయూత సంస్థ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువై సేవలను అందిస్తోందని, సభ్యుల అంకితభావం, దాతల విశ్వాసమే సంస్థ విజయానికి మూల కారణమని పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గత 2 వేల రోజులుగా నిరంతర నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఇప్పటివరకు 8,42,000 మందికి పైగా భోజనాన్ని అందించడం జరిగిందని తెలిపారు. అలాగే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భిణీ స్త్రీలు, రోగుల సహాయకులకు కూడా నిరంతర అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. చేయూత చిల్డ్రన్ హోమ్ ద్వారా 62 మంది అనాథ, నిరుపేద చిన్నారులకు ఉచితంగా ఆహారం, వసతి, విద్య, వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రక్తదాన ఉద్యమంలో భాగంగా 35 వేల యూనిట్లకు పైగా రక్త సేకరణ, 272 మంది విద్యార్థులకు విద్యా సహాయం, 30 వేల మొక్కల నాటకం, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, వృద్ధులకు చేయూత, రైతులకు సహాయం, అవయవదాన అవగాహన కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీలు, హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల సహకారంతో ఇప్పటివరకు 12 విభాగాల్లో రూ.16.72 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో సొంత చిల్డ్రన్ హోమ్ క్యాంపస్, వృద్ధులకోసం ఆత్మీయ నిలయం, మరిన్ని ప్రాంతాలకు నిత్యాన్నదాన విస్తరణ, విద్యార్థులకు కెరీర్ సపోర్ట్, లక్ష మొక్కల ఉద్యమం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.చేయూత సంస్థ సేవలను మరింత విస్తృతం చేసేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ జిల్లా కార్యవర్గ టీమ్స్, నియోజకవర్గ టీమ్స్ ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.

విద్యార్థులకు చెక్ లు పంపిణీ

తదనంతర కార్యక్రమంలో వైద్యానికి చేయూతలో భాగంగా పలువురికి చదువుకు చేయూత లో భాగంగా విద్యార్థులకు నగదును చెక్ రూపంలో అందించారు. వికలాంగ కుటుంబాల స్వావలంబన కోసం వారి కుటుంబాలలో ఇద్దరికి కుట్టుమిషన్లు, కొంతమంది విద్యార్థులకు సైకిల్స్ అందించారు. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న గర్భిణీ స్త్రీలకు, చిన్నారులు 200 మందికి పౌష్టికాహార కిట్స్ అందజేశారు. తదనంతరం అన్నదాతలైన రైతులను, దేశాన్ని రక్షిస్తున్న సైనికులను, జాతి నిర్మాతలైన ఉపాధ్యాయులను, వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులను సన్మానించడంతో పాటు, దాతలు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో చేయూత అడ్వైసర్ పి సుబ్బారావు, సురభి శారద, తోట స్వామి, తేజస్వి, మంజుల, నాగదేవి, ఝాన్సీ, సత్యకీర్తి, అంగాడ లక్ష్మి, పోసమ్మ, అనిత, బంగార్రాజు, కర్రి వీర శివ, చింతా పవన్ కళ్యాణ్, యళ్ళ పండు, విష్ణు నాయుడు, వెంకట్, శ్రీరామ్, విష్ణు, సుభాన్, లోకారెడ్డి స్వామి, సత్య, ప్రవీణ్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్