శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుపాను ఎఫెక్ట్.. స్తంభించిన జనజీవనం

27 అక్టోబర్, 2026

తుపాను ఎఫెక్ట్.. స్తంభించిన జనజీవనం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సామర్లకోట : ‘అర్నబ్’ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో సామర్లకోట, పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉధృతమైన పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనల మధ్య ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కూలిన విద్యుత్ స్తంభాలు

సామర్లకోట పట్టణంలోని గణపతినగర్‌ వాటర్‌ ట్యాంకుల సమీపంలో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చిన స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో భారీ వృక్షాలు నేలకొరగడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను తీవ్రత పెరగడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సాయంత్రం నాలుగు గంటల నుంచే పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. భీకర గాలుల శబ్దాలు, కుండపోత వర్షాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

వర్షపాతం వివరాలు

అర్నబ్‌ తుపాను ప్రభావంతో పెద్దాపురం డివిజన్‌ పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలను ఆర్డీవో కృష్ణమూర్తి వెల్లడించారు. డివిజన్‌ పరిధిలోని తొండంగి మండలంలో అత్యధికంగా 47.8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, ఏలేశ్వరం మండలంలో అత్యల్పంగా 19.4 సెంటీమీటర్లు నమోదైనట్లు తెలిపారు. తొండంగి 47.8, కిర్లంపూడి 37.4, ప్రత్తిపాడు 36, శంఖవరం 35.4, , రౌతులపూడి 34, సామర్లకోట 32.4, పెద్దాపురం 29.6, తుని 28.6, కోటనందూరు 27.4, గండేపల్లి 26.4, జగ్గంపేట 26.2, ఏలేశ్వరం 19.4 నమోదైనట్లు పేర్కొన్నారు. తుపాను తీవ్రరూపం దాల్చినందున డివిజన్‌ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆర్డీవో కృష్ణమూర్తి సూచించారు.

SKT 1 సామర్లకోటలో భారీ ఈదురు గాలులు వీస్తున్న దృశ్యం

SKT2 సామర్లకోటలో నేలకొరిగిన విద్యుత్ స్తంభం

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్