సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంబేద్కర్‌ను కించపరిచిన హమారా ప్రసాద్‌పై చర్యలు చేపట్టాలి : దళిత, వామపక్ష ప్రజా సంఘాలు నిరసన

11 సెప్టెంబర్, 2026

Action must be taken against Hamara Prasad for insulting Ambedkar: Dalit and Left-wing civil society groups protest.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 02:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానిస్తూ, కించపరిచే వ్యాఖ్యలు చేసిన నగులపు హమారా ప్రసాద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత, వామపక్ష ప్రజా సంఘాలు, బహుజన, అంబేద్కర్‌వాదులు నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను, భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానిస్తూ, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న నగులపు హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రామచంద్రపురం మెయిన్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద, అనంతరం , పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీలం మధుసూదన్ రావు, పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్దు, రామచంద్రపురం బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు కొల్లపు కామేశ్వరరావు, రామచంద్రపురం దళిత సీనియర్ న్యాయవాది గాలింకి చిట్టిబాబు తదితరులు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆయనను అవమానిస్తూ పుస్తకం రాయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను అవహేళన చేసే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటాన్ని కించపరిచే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్రను వక్రీకరించి హమారా ప్రసాద్ రాస్తున్న “కల్పిత నాయకుడు” పుస్తకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా పరిశీలించి నిషేధించాలని డిమాండ్ చేశారు.హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.భిన్నాభిప్రాయాలు, విమర్శలు, వాక్ స్వాతంత్రానికి తాము వ్యతిరేకం కాదని, అయితే భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించడం,రాజ్యాంగాన్ని కించపరచడం, కులాల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలపై చట్టపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇకపై కూడా భారత రాజ్యాంగం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.అనంతరం ఎస్. ఐ. నాగేశ్వరరావు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐ కేఎంఎస్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, అంబటి కృష్ణ, జై భీమ్ సంక్షేమ సంఘం నాయకులు గుబ్బల శ్రీనివాస్, వెంటపల్లి రామకృష్ణ, సి.హెచ్. పట్టాభి, నియోజకవర్గ బి.ఎస్.పి పార్టీ ఉపాధ్యక్షుడు ఆలీ, పి.వై.ఎల్ జిల్లా నాయకులు ఉండ్రు కార్తీక్, ముస్లిం మైనార్టీ నాయకులు జూల్ఫీ, యాకోబ్, రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://prajasakti.com/te-IN/districts/konaseema/action-must-be-taken-against-hamara-prasad-for-insulting-ambedkar-dalit-and-left-wing-civil-society-groups-protest


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్