సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాధిత కుటుంబానికి చిన్నబాబు ఆర్థిక చేయూత

1 గంట క్రితం

Chinnababu provides financial support to the affected family
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఆపదలో ఉన్న పార్టీ నాయకులకు అండగా నిలుస్తూ మండలంలోని పెనికేరుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వెంకటేశ్వర సంస్థల అధినేత ఈదర చిన్నబాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రమాదవశాత్తు గాయపడి కాలుకు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న స్థానిక టీడీపీ నాయకుడు చొల్లంగి శ్రీనివాస్‌ను ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చుల నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా అందజేశారు. అనుకోని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి, వారికి అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈదర చిన్నబాబు తన సేవాభావాన్ని చాటుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆర్థిక సహాయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మేకా రాంబాబు, గొడవర్తి భాస్కరరావు, కోన దత్తుడు, తదితర నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్