గ్రామ రాజకీయ సమీకరణాలతోనే పార్టీ మార్పు
జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాసరావు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న మాజీ పిహెచ్సి చైర్మన్ రామకృష్ణ.
జన సైనికులకు దిశ నిర్దేశం చేయగలిగిన నేత దొరకటం శుభపరిణామం.
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక ఎన్నికల వేళ ఆలమూరు మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టిడిపి కి చెందిన, చొప్పెల్ల పీహెచ్సి మాజీ చైర్మన్ ఆకుల రామకృష్ణ సోమవారం తన కుటుంబ సభ్యులతో పాటు బంధు, మిత్ర, తదితర అనుయాయులతో కలిసి జనసేన పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు సమక్షంలో స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన జనసేన కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ రాజకీయ సమీకరణాల కారణంగానే టిడిపి నుంచి జనసేన పార్టీలోకి మారడం జరిగిందన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తో తణుకు మంచి అనుబంధం ఉందన్నారు. నేను 1981లో రాజకీయ రంగ ప్రవేశం జరిగిందన్నారు. సుమారు 45 ఏళ్ల ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసి తట్టుకున్నానని ఆయన వివరించారు. అలాగే జనసేన నేత బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నేపద్యం ఉన్నటువంటి రామకృష్ణ లాంటి వ్యక్తి పార్టీలో జాయిన్ కావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబానికి చెందిన సుమారు 55 కుటుంబాలకు పైగా పార్టీ లో చేరడం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగా జనసేన నాయకుల సమక్షంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాసరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా ఒకవైపు స్థానిక ఎన్నికల సందడి నెలకొంటుండగా.. మరోవైపు బలమైన రాజకీయ నేపథ్యమున్న నాయకుడు చేరిక స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో సీనియర్ నాయకుడు పార్టీ మారడంతో చొప్పెల్లతో పాటు ఆలమూరు మండల రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి పలువురిలో నెలకొంది. ఈ చేరిక రానున్న స్థానిక ఎన్నికల రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడు మండల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు సురపురెడ్డి సత్య, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, జనసేన నేతలు తోరాటి సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి మహేష్, సోము వీర్రాజు, సోము శ్రీను, దంగేటి బాపనయ్య, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)