శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి పాలనలో పల్లెల్లో అభివృద్ధి వేగవంతం : ఎమ్మెల్యే బండారు

07 ఆగస్టు, 2026

Development in villages has accelerated under the alliance government: MLA Bandaru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అయిందని, పల్లెల్లో సంక్షేమం, అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం కలవచర్లలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి,సంక్షేమం కార్యక్రమంలో ఆయన కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉపాధి నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ ని పరిశీలించి, రూ.5 లక్షల మండల నిధులతో అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రజలు తమపై నమ్మకం పెట్టుకుని ఇచ్చిన భారీ విజయాన్ని బాధ్యతగా తీసుకొని పాలన సాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పెంచిన పింఛన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం 2.0, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులనూ ప్రజలకు వివరించారు. రూ.36 లక్షలతో చేపట్టిన హెల్త్ క్లినిక్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్