శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పీపీ సునీల్ కుమార్ ను అభినందించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా

1 రోజు క్రితం

District SP Rahul Meena congratulated PP Sunil Kumar.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : వరుసగా నడుస్తున్న వివిధ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్న రామచంద్రపురం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆలమూరుకు చెందిన కప్పల సునీల్ కుమార్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. ఈ మేరకు ఎస్పీని అమలాపురంలో తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్ కుమార్ కు ఆయన ఇన్ డోర్ ప్లాంట్ ను అందించి ప్రశంసించారు. రామచంద్రపురం అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు చేపట్టిన దగ్గర నుంచి నిందితులకు వరుసగా జైలు శిక్షలు పడేలా కేసులను సమర్థవంతంగా కోర్టులో నడిపిస్తున్న తీరును పోలీసులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ అన్నారని సునీల్ తెలిపారు. ఎంత కేసుల విచారణ సమయంలో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడం, కేసుల పురోగతిని పర్యవేక్షించడం, ప్రాసిక్యూషన్ అధికారులతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తేనే గాని సాధ్యపడదని ఎస్పీ అన్నట్లు ఆయన తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందజేయడమే తన ధ్యేయమని సునీల్ అన్నారు. వృత్తిని పారదర్శకంగా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పిపి సునీల్ కుమార్ ను ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్