ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలయానికి స్టీల్ ప్లేట్ల వితరణ

1 గంట క్రితం

Donation of steel plates to the temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం దూరప్రాంత యాత్రికుల కోసం నిర్వహిస్తున్న అన్నదానం నిమిత్తం పెదపళ్ళకు చెందిన బిక్కిన వెంకటేశ్వరరావు దంపతులు ఆదివారం స్టీల్ ప్లేట్లను అందజేశారు. ఆలయ పాలకమండలి చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఈవో నరేంద్ర కుమార్, పాలకమండలి సభ్యులు దాతలలో ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో విరాళాలు విరివిగా అందజేస్తూ ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్