సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిద్ధార్థ స్కూల్లో ముందస్తు చవితి వేడుకలు..

11 సెప్టెంబర్, 2026

aalamuru -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల కేంద్రంలోని శ్రీ సిద్ధార్థ స్కూల్లో పాఠశాల అధినేత కెముల్లారావు ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక వేషధారణలు అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, స్కిట్లు ఆకట్టుకున్నాయి. ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భాగంగా వినాయక ప్రతిమకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్ష‍ణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని ప్రిన్సిపల్‌ కోరారు. అనంతరం విద్యార్థులకు వినాయక మట్టి ప్రతిమలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి ఫాల్స్ జెస్సీనా జోసఫ్, విష్ణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్