ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనార్ధన స్వామిని దర్శించుకున్న ఎలక్ట్రికల్ డీఈ రాంబాబు

58 నిమిషాల క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారిని కొత్తపేట ఎలక్ట్రికల్ డీఈ కొత్తపల్లి రాంబాబు ఆదివారం దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని డీఈ రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అంగర భగవానాచార్యులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎలక్ట్రికల్ డీఈ రాంబాబు తెలిపారు. అలాగే ఆలయానికి విద్యుత్ నిరంతరాయంగా సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రాంబాబు, డిఈ రాంబాబును అభినందించి, సత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్