బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

1 గంట క్రితం

Foundation stone laid for development works in various villages
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల పరిధి వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూటమి నాయకులు బుధవారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈదల సత్తిబాబు, సలాది నాగేశ్వరరావు, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, ఏఎంసీ చైర్మన్ కొత్తపల్లి వెంకటలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ తాడి శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ ... విబి గ్రామ్ జి నిధులు రూ. 27 లక్షలతో మడికి లో రెండు చోట్ల సిసి రోడ్ల నిర్మాణానికి, బడుగువానిలంకలో పుష్కర నిధులు రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, జొన్నాడ లో రూ. 1.20 కోట్లతో మెటల్ రోడ్డు, పుష్కర నిధులు రూ. 65 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా వివిధ కారణాలతో అభివృద్ధికి నోసుకోకుండా మిగిలిపోయిన వాటిని పరిష్కరించి గ్రామాల్లో సిసి రోడ్లను, గ్రామాల మధ్య బిటి రోడ్లను, రైతులకు అణువుగా పుంత మార్గాల్లో మెటల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దపీట వేస్తు అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయిస్తూ ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు దొండపాటి సుబ్బరాజు, చెల్లబోయిన శ్రీనివాస్, పంపన అంజిబాబు, కొత్తపల్లి నగేష్, కొత్తపల్లి కృష్ణ, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్