బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాల భవనానికి శంకుస్థాపన

1 గంట క్రితం

పాఠశాల భవనానికి శంకుస్థాపన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పాతపట్నం

మండలంలోని చాకిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.40 లక్షలు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఈ మేరకు భవన నూతన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇటీవల పరిశీలించానని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దృష్టికి తీసుకెళ్లి, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్పందించి రూ.40 లక్షలు మంజూరు చేయడంతో నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్