బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ

1 గంట క్రితం

అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, పార్టీలకతీతంగా వార్డులో అభివృద్ధి చెందుతున్నాయని ఎపి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. పలాస శివాజీ నగర్‌లో రూ.9.50 లక్షలతో బుధవారం సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా వార్డులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.122 కోట్లతో ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు శరవేగంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్