ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని కండ్రిగ పేట ఎంపీపీ పాఠశాల పూర్వపు ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నేత, రిటైర్డ్ హెచ్ఎం, గొలుగూరి భాస్కర్ రెడ్డి బుధవారం ఎంఈవో1 బి.అప్పాజీ, ప్రధానోపాధ్యాయులు అద్దరి శ్రీనివాసరావు, సహోపాధ్యాయులు పిల్లి రాంబాబుల సమక్షంలో మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ స్టవ్ ను అందజేశారు. తాను మొట్టమొదట పనిచేసిన పాఠశాలకు గ్యాస్ స్టవ్ ను అందజేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులందరూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై విద్యను అభ్యసించి మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని భాస్కర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంఇఓ అప్పాజీ, దాత భాస్కర్ రెడ్డి సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో పాఠశాలలకు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.
కండ్రిగపేట పాఠశాలకు గ్యాస్ స్టవ్ అందజేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)