ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెడ్పీ ఛైర్‌పర్సన్‌ రేసులో గొల్లపల్లి అమూల్య...!

1 గంట క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- టిడిపి అధిష్ఠానం పరిశీలనలో పేరు


ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : డాక్డర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కూటమి అభ్యర్థిగా గొల్లపల్లి అమూల్య పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించడంతో ఆమెను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమూల్య రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆమె వివాదాస్పదములేని వ్యక్తిగా రాజోలు నియోజకవర్గం లో మంచి పేరు సంపాదించారు. ఇటీవల అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా ఆమె కలుసుకుని అభివృద్ధి గురించి మాట్లాడారని గొల్లపల్లి అమూల్యకు రాజకీయంగా చరిత్ర కలిగిన వ్యక్తిగా పేరు ఉంది. ఆమె తండ్రి మాజీ మంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు పూర్వపు సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన పేరు గొల్లపల్లి సూర్యరావు ఆయన కుమార్తె అమూల్య రెండుసార్లు మంత్రిగా పనిచేసిన గొల్లపల్లి సూర్యరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కోనసీమలో అల్లవరం నుండి రెండుసార్లు రాజోలు నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తొలుత కొత్తపేట సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆ టైంలోనే ఎన్టీ రామారావు తెలుగుదేశం లోకి ఆహ్వానించి అల్లవరం సీటు సూర్యారావు కేటాయించారు అలాగే మంత్రి పదవి కూడా ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఇంత రాజకీయ చరిత్ర కుటుంబం కలిగిన గొల్లపెల్లి అమూల్యకు కోనసీమ జిల్లా ఎస్సీ రిజర్వుడు మహిళలకు కేటాయించడంతో గొల్లపల్లి అమూల్య పేరు ఇప్పుడు జిల్లా పరిషత్ కు దాదాపు ఖరారు అయినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.గత ఎడాదిగా రాజోలు టిడిపి ఇన్ చార్జ్ గా ఉన్న అముల్య రాజోలు నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.నియోజకవర్గం అనేక ఆనారోగ్య బాధితులకు సిఎం రిలిఫ్ ఫండ్ అందజేస్తు ప్రజల మన్ననలు పొందుతున్నారు.ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులకు తగిన గుర్తింపు కల్పించే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో జెడ్పిటిసి స్థానాలు జనరల్ కు కేటాయించడంతో మామిడికుదురు జెడ్పిటిసి స్థానం ఎస్సీ కావడంతో అమె మామిడికుదురు జెడ్పిటిసి గా బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్