శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండ

31 అక్టోబర్, 2026

aalamuru-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పెదపళ్లలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తూ తహసీల్దార్ కుశరాజు.

ప్రజాశక్తి - ఆలమూరు : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామంలో కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లను ఆలమూరు తహసీల్దార్ కందుల కుశరాజు శనివారం పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఇళ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుఫాన్ కారణంగా కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం మంజూరైన అనంతరం బాధితులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఇళ్లు పూర్తిగా కూలిపోయి నిరాశ్రయులైన నిరుపేద బాధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వారికి పక్కా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్వో ఉదయ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్