ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : 80 వ స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో మండల కేంద్రంలోని డాక్టర్ బొబ్బా జయశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం టిడిపి మండల ప్రధాన కార్యదర్శి సలాది నాగేశ్వరరావు అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా'ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముందుగా సలాది నాగేశ్వరరావు మండల కూటమి నాయకులతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హైస్కూల్ నుండి నుంచి వినాయక గుడి జంక్షన్ వరకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్థానిక ప్రజలు త్రివర్ణ పతాకాలను చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" నినాదాలతో పరిసరాలను మార్మోగించారు. కూటమి నాయకులు పిఎసిఎస్ చైర్మన్ వంటిపల్లి సతీష్, మాజీ ఏఎంసీ చైర్మన్ నల్లబాబు, మాజీ జెడ్పిటిసి రామానుజుల శేషయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ కేతా రాంబాబు, నాయకులు ఈదల రాంబాబు, రాము, గణేష్, చల్లా ఉదయం, పట్టాభి, చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాదయాత్రగా సాగుతూ పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడానికి, జాతీయ సమైక్యతను చాటడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆలమూరు లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)