సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల భద్రత కోసం బారికేడ్ల ఏర్పాటు

11 సెప్టెంబర్, 2026

Installation of barricades for student safety
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : జొన్నాడ మండపేట ఆర్ అండ్ బి రహదారిపై మండలంలోని కొత్తూరు సెంటర్ వద్ద శుక్రవారం విద్యార్థుల భద్రత ప్రమాదాల నివారణ కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్య బోధన సముదాయాలు అనగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీతో పాటు ప్రవేటు స్కూళ్లు విద్యార్థులు రాకపోకలు సాగించడం జరుగుతుందన్నారు. వారి భద్రత కోసం ఈ సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏర్పాటు చేశారని ఆయా విద్యా సముదాయాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లు తెలిపారు. అయితే దశాబ్దాలుగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు బారికేడ్ల ఏర్పాటు చర్యలు ఎవరు తీసుకోలేదని, ఆ కలని నిజం చేసినటువంటి ఎమ్మెల్యే బండారుకు, మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు ఈదల సత్తిబాబు, సలాది నాగేశ్వరావు, కూటమి నాయకులకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సురేష్ రెడ్డి, ఎంఇఓ1 భమిడిపాటి అప్పాజీ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వై.వి.వి.రమణ, హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం పి.సత్యనారాయణ, పి.డి ఎన్.వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్