సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు

11 సెప్టెంబర్, 2026

Jana Vignana Vedika Mandal-level Chekumuki Science Competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 03:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి మండల స్థాయి సైన్స్ సంబరాలు శుక్రవారం మండలం యు టి ఎఫ్ అధ్యక్షుడు జి. నాగేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. మండల జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి సూరుమేను శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడికుదురు హై స్కూల్ సైన్స్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్ ఇ ఒ1ఒ వి.శ్రీనివాస్, ఎమ్ ఇ ఒ 2మోకా వెంకన్న బాబు , హై స్కూల్ హెచ్ఎం బి చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని మండల స్థాయి చెకుముకి సంబరాల పరీక్షా పత్రము ఆవిష్కరించారు. ఎమ్ ఇ ఒ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకుని ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా ఆలోచించి సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలని పర్యావరణ రక్షించే విధంగా పర్యావరణ స్పృహను కలిగి ఉండాలని , మూఢనమ్మకాలపై పోరాటం చేయాలని తెలిపారు. సూరుమేను శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్ నినో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు పర్యావరణ హితకార్యక్రమాలు చేయాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచాలని తెలిపారు ఈ మండలం నుంచి 13 హైస్కూల్ నుంచి ఐదు ప్రైవేట్ స్కూల్ నుంచి మొత్తం మొత్తం 20 టీములు పాల్గొన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ఈదరాడ హై స్కూల్ , ప్రధమ బహుమతి, మామిడికుదురు హై స్కూల్ ద్వితీయ, మొగలికుదురు హై స్కూల్ తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ప్రైవేట్ స్కూల్ నుంచి దీప్తి ఇంగ్లీష్ మీడియం (నగరం) ప్రథమ బహుమతి, దీప్తి ఇంగ్లీష్ మీడియం (మామిడి కుదురు) ద్వితీయ బహుమతి, ఎడ్యుకేర్ ఇంగ్లీష్ మీడియం (నగరం) తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. వీరికి మమ్మంటోలు అందజేసి మండల విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా సూరుమేను శ్రీనివాసరావు తల్లి గంగామణి జ్ఞాపకార్థం పర్యావరణ పరిరక్షణకై పోటీలకు హాజరైన ప్రతి స్కూలుకు 1,500 విలువచేసే జామ మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ట్రెజరర్ కె కేశవరావు, కె సత్యనారాయణ, ఎ.కొండయ్య, పి మల్లేశ్వర్ , పి సత్యబాబు , కె వి ఎస్ చంద్ర రావు, కాజాముయుద్దీన్ , దుర్గారావు టీచర్లు, ఉపాధ్యాయులు మొదలైన వారు పాల్గొన్నారు.
Jana Vignana Vedika Mandal-level Chekumuki Science Competitions


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్