గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనార్దనస్వామి హుండీ ఆదాయం రూ.2,24,818

1 గంట క్రితం

aalamuru-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : నారద ప్రతిష్టితమైన నవ జనార్దన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయానికి హుండీ ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది. గురువారం దేవాదాయ శాఖ రామచంద్రపురం తనిఖీదారు బాలాజీ రామ్ ప్రసాద్ ఆదేశాలతో మూలస్థానం గ్రూప్ ఆలయాల ఈవో మద్దూరి శివరామకృష్ణ, ఆలయ ఈవో నరేంద్ర కుమార్ ల ఆధ్వర్యంలో హుండీని తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. ఆలయంలో గతంలో ఎన్నడూ లేనంతగా అధిక స్థాయిలో హుండీ ఆదాయం లభించడం విశేషం. మొత్తం నోట్లు, నాణేలు కలిపి రూ.2,24,818ల ఆదాయం సమకూరిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు. గతంలో కన్నా అధిక సంఖ్యలో ఆదాయం రావడానికి, నానాటికి స్వామి దర్శనానికి పెరుగుతున్న యాత్రికులు, వారి అచంచల భక్తి విశ్వాసాలే కారణమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకు కృషి చేస్తున్న ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబును ఈవో ఎమ్మెస్సార్ కృష్ణ, ఈవో నరేంద్ర కుమార్ లతో పాటు పలువురు అభినందించారు. నాలుగు శనివారాలు, నాలుగు ప్రదక్షిణల నేపద్యంలో యాత్రికులు రోజురోజుకు పోటెత్తుతున్నారని, దీంతో ఆలయం యొక్క వైభవం దిన,దిన ప్రవర్ధమానమవుతుందని ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అంగర భగవానాచార్యులు, పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్