ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ 18 గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఆర్.టి.ఐ దరఖాస్తులు వేసిన వారికి డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ చూడు అలవాటు మానుకోవాలి . ఆర్టిఐ చట్టం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్టిఐ దరఖాస్తు వేసిన వారికి తిరిగి సమాధానం ఇచ్చే విధంగా తయారవ్వాలి అంతే తప్ప డబ్బులు ఇచ్చి తప్పించుకునే అలవాటు నేర్పితే అది మీకు ప్రమాదమే మీకు దరఖాస్తు వచ్చి 30 రోజులు వరకు తిరిగి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంది తెలియకపోయినచో తెలిసిన వారికి వెళ్లి నేర్చుకొని తిరిగి సమాధానం ఇచ్చే స్థాయికి ఎదగాలి . కొంతమంది దళారులు సీనియర్లు మీ వద్దను డబ్బులు వసూలు చేసి ఆర్.టి.ఐ దరఖాస్తు పెట్టినవారికి మొట్ట చెబుతున్నట్లు నాకు సమాచారం వచ్చినది. ఇటుపైన ఎవరైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్లు నాకు గుర్తుకొస్తే అటువంటి శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో తెలిపారు
సచివాలయం సిబ్బందికి ఎంపీడీవో సూచన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)