శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగహన అవసరం

1 రోజు క్రితం

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగహన అవసరం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముమ్మిడివరం : పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగహన కలిగి ఉండాలని ముమ్మిడివరం నగర పంచాయతీ మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎ.దేవకీ దేవి సూచించారు. బ్రిక్స్ సస్టైనబులు లైఫ్ స్టైల్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్లకు నిర్వహించిన అవగాహనా సదస్సుకు దేవకీ దేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని వివరించారు. ఎలక్ట్రానిక్ పరికరాలైన పాడైన సెల్ ఫోన్లు, కంప్యూటర్ పరికరాలు, టెలివిజన్,బ్యాటరీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా కేవలం శానిటరీ సిబ్బంది ప్రత్యేకంగా సేకరించేందుకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లలో వేయడం ద్వారా, ఈ ప్రత్యేక డస్ట్ బిన్ ల నుండి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించి ,వాటిని ఉపయుక్తంగా మారుస్తారన్నారు. అంతే కాకుండా హానికరమైన ఈ వేస్ట్ పదార్థాల వల్ల భూగర్భ జలాలు,నేల, గాలి, కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయం. నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్, సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వ్యర్థాల నిర్వహణ పై అవగాహన సదస్సు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్