సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలమూరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక ఏర్పాట్లు

1 గంట క్రితం

Preparatory arrangements for MPTC and ZPTC elections in Alamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎన్నికల అధికారులకు విధులపై శిక్షణ


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రమైన ఆలమూరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు సన్నాహక ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక డాక్టర్ బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ అధికారులు (పీఓ), సహాయ పోలింగ్ అధికారులు (ఏపీఓ)లు, బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలమూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) లక్ష్మీ ప్రత్యూష, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో), ఎంపీడీవో ఎ.రాజు ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమ నిబంధనలు, పోలింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విధులకు కేటాయించిన బూత్ లెవెల్ పీఓలు, ఏపీఓలతో పాటు ఎంఈవోలు అప్పాజీ, రాజు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్