మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా ప్రచురణ

1 గంట క్రితం

Publication of voters' list in the municipality
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఇటీవల పునర్విభజన చేసిన 32 వార్డులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ లను మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్ ఆర్ రాజు మంగళవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1 నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో గల 28 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేశామని, ఆయా వార్డులలో ఆధునికరించిన ఓటర్ లిస్టులను ప్రకటించాలని ఆదేశాలతో ఓటర్ లిస్టులో జాబితాలను మున్సిపల్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటుగా రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలోనూ, గ్రామ వార్డు సచివాలయాల్లోనూ, శాఖా గ్రంధాలయంలో, తాసిల్దార్ కార్యాలయంలో, పోస్ట్ ఆఫీస్ వద్ద, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే పని, పట్టణ ప్రజలు ఓటర్ లిస్టులను సరిచూసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్