ప్రజాశక్తి - ఆలమూరు : తమ సమస్యల పరిష్కారం కోరుతూ మండల పరిధిలోని రేషన్ డీలర్స్ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కందుల కుశరాజుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019లో అప్పటి సీఎం చంద్రబాబు రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి జీవో నెంబర్. 5 విడుదల చేశారన్నారు. దీనిని అమలు చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే గోనె సంచుల రూపంలో ఉన్న బకాయిలను వెంటనే డీలర్లకు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే అధిక పని భారంతో ఉన్నామని, మరింత భారం పెంచకుండా సంబంధిత పనులను ఇతరులకు అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలర్లు అందజేసిన డిమాండ్లను పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్ల సమస్యలపై తహసిల్దార్ సానుకూలంగా స్పందించారని, విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తామని, ఆయన హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎస్.గోపాలకృష్ణ, కె.జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ రేషన్ డీలర్స్ వినతి పత్రం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 02:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)