బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

150 ఏళ్ల చారిత్రాత్మక రావి చెట్టుకు పునర్జీవం

1 గంట క్రితం

Revival of a 150-year-old historic Peepal tree
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం : ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ


ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : మొగలికుదురు సెంటర్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిన సుమారు 150 ఏళ్ల నాటి చారిత్రాత్మక రావి చెట్టును సంరక్షించేందుకు రిప్లాంటేషన్ ప్రక్రియకుఎమ్ ఎల్ ఎ గిడ్డి సత్యనారాయణ బుధవారంకొబ్బరి కాయ కొట్టి శ్రీకారం చుట్టారు.ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్నప్పటికీ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ మహావృక్షాన్ని తొలగించకుండా రిప్లాంటేషన్ ద్వారా మరో ప్రదేశంలో సురక్షితంగా నాటాలనినిర్ణయించామన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి పనులు ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్తూనే, సాధ్యమైనంత వరకు చెట్లు, పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 150 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ రావి చెట్టును కాపాడటం ద్వారా ప్రకృతి పరిరక్షణతో పాటు భావితరాలకు ఒక పచ్చని వారసత్వాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాల నిర్మాణం మాత్రమే కాదని, ప్రకృతిని పరిరక్షిస్తూ ముందుకు సాగడమే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్యే అన్నారు. “ఒక చెట్టును కాపాడటం అంటే ఒక వృక్షాన్ని మాత్రమే కాపాడటం కాదు… 150 ఏళ్ల చరిత్రను, ఎన్నో తరాల జ్ఞాపకాలను, భవిష్యత్ తరాల పచ్చని భవిష్యత్తును కాపాడటమే” అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్