గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జొన్నాడ పుష్కర ఘాట్ కు రూ.2.08 కోట్ల నిధులు

1 గంట క్రితం

aalamuru-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : గోదావరి నది పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంకు వచ్చే లక్షలాది మంది యాత్రికులతో ఘాట్లు కిటకిటలాడటం పరిపాటే. దీంతో వివిధ ప్రాంతాల్లో సర్దుబాటు చేసే నిమిత్తం మండలంలోని జొన్నాడ పుష్కర ఘాటు ఏ వన్ కావడంతో అభివృద్ధికి పెద్దపీట వేసి సుమారు 2.08 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఎంపీడీవో ఏ.రాజు, పంచాయతీరాజ్ జేఈ డి.వీరభద్రరావు గురువారం తెలిపారు. జాతీయ రహదారి పక్కనే రాజమహేంద్రవరంనకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో జొన్నాడ పుష్కర ఘాట్‌కి ప్రాధాన్యం పెరిగిందన్నారు. దీంతో ఈ పుష్కరఘాట్‌కు ప్రత్యేక నిధులు కేటాయించారు. గతంలో రెండు రేవులుగా ఉండే జొన్నాడ పుష్కరాల రేవులను ఒక్కటే భారీ ఘాట్‌గా ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని నిమిత్తం రూ.1.48 కోట్లు మంజూరుచేశారన్నారు. ఈ నిధులతో పాటు పుష్కరఘాట్‌కు చేరుకునేందుకు రెండు బ్రిడ్జిల మధ్య సీసీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. దీంతో జొన్నాడ పుష్కరాలకు రూ.2.08 కోట్ల నిధులయ్యాయన్నారు. 2015 పుష్కరాల్లో జొన్నాడ పుష్కర ఘాట్లో అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో గ్రేడ్-1గా గుర్తింపు పొందిందన్నారు. ఈ ఘాట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొత్త పేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో అన్ని శాఖల సమన్వయతో దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. అలాగే బడుగువానిలంక, ఆలమూరు పుష్కర ఘాట్ల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి పుష్కరాల అధికారులు పరిశీలన చేసి, పలు సలహాలు సూచనలు అందజేసి వెళ్లారన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్