సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి : డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు

11 సెప్టెంబర్, 2026

Safety standards must be strictly followed: Division Executive Engineer Rambabu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 10:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రావువులపాలెం (కోనసీమ) : మండల కేంద్రం రావులపాలెం లో అసిస్టెంట్ ఇంజనీర్ పి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కొత్తపేట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్తపల్లి రాంబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని వినియోగించుకుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉత్సవ కమిటీలు విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఈ క్రింది భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తెలియజేసారు. మండపాలకు విద్యుత్ అధికారికంగా కనెక్షన్ తీసుకోవాలని అనధికారికంగా విద్యుత్‌ను వినియోగించరాదని,విద్యుత్ వైర్లు, కేబుళ్లు నాణ్యమైనవి,ఐఎస్ ఐ ప్రమాణాలు కలిగినవి మాత్రమే ఉపయోగించి దెబ్బతిన్న వైర్లను ఉపయోగించరాదన్నారు.డిబి బాక్స్‌లో ఎంసిబి/ఇఎల్ సిబి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.డిబి బాక్స్ వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలి.మండపం వద్ద సరైన ఎర్తింగ్ వైరింగ్ ఏర్పాటు ఎర్తింగ్ లేకుండా విద్యుత్ పరికరాలను వినియోగించరాదని,విద్యుత్ వైరింగ్‌ను నీరు, తేమ మరియు మండపంలోని ఇతర వస్తువులకు దూరంగా ఉంచాలన్నారు.విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లకు సమీపంలో మండపాలు లేదా అలంకరణలు ఏర్పాటు చేయరాదని తెలియచేసారు.లైటింగ్ కోసం ఎల్ఇడి బల్బులు/లైట్లు మాత్రమే ఉపయోగించడం మంచిది. విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా సరైన సామర్థ్యం గల వైర్లు, పరికరాలు ఉపయోగించాలని కోరారు.పిల్లలు, భక్తులు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మండపాల్లో ఫ్యూజులు, రిలేలు వంటి రక్షణ పరికరాలను బైపాస్ చేయరాదని తెలిపారు.విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎపిఇపిడిసిఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని తెలిపారు.వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎటువంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్