ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సన్న బియ్యం అమ్మకాల కేంద్రాన్ని తహసిల్దార్ కె.కుశరాజు, కూటమి నాయకులు, రైస్ మిల్లర్స్ యజమానులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10 కేజీలు చొప్పున ఈ సన్న బియ్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం రెండు రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవి కేజీ రూ.52 మొదటి రకం, కేజీ రూ. 50 రెండవ రకంగా లబ్ధిదారులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు తహసిల్దార్ కుశరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వంటిపల్లి పాపారావు, వైట్ల కనకదుర్గారావు, వట్టికూటి సతీష్, సొసైటీ చైర్మన్ వంటిపల్లి సతీష్ కుమార్, మాజీ జెడ్పిటిసి రామానుజుల శేషగిరిరావు, ఏఏంసి ఉపాధ్యక్షుడు కేతా రాంబాబు, కూటమి నాయకులు ఈదల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
సన్న బియ్యం అమ్మకాలు ప్రారంభం : తహసిల్దార్ కుశరాజు
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)