మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్షేత్రస్థాయి సమస్యలపై తక్షణ స్పందన : కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం

11 నిమిషాల క్రితం

Immediate response to field level issues Regular updates to the Commission
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు అభినందనీయం


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చూపుతున్న చొరవ, సమర్థత ప్రశంసనీయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అభినందించారు. సమస్యాత్మక జిల్లాగా పేరున్న పల్నాడులో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆమె తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియలో తలెత్తే ఇబ్బందులను దాచిపెట్టకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడంతో పాటు, వాటి పరిష్కారానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సమాచారాన్ని నిరంతరం ఎన్నికల కమిషన్‌ కు అందించడం ద్వారా సమన్వయాన్ని పటిష్టం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, అధికారుల జవాబుదారీతనం కీలకమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఈ అంశాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అనుసరిస్తున్న విధానం ఇతర జిల్లాల అధికారులకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ బి. రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్