మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుడిసె అంటుకొని ఐదేళ్ల బాలుడు సజీవదహనం

19 నిమిషాల క్రితం

Five year old boy burnt to death after hut catches fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 02:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కొత్తపల్లి (నంద్యాల) : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామంలో ప్రమాదవశాత్తు గుడిసె అంటుకొని ఐదేళ్ల బాలుడు సజీవ దహనమైన ఘటన మంగళవారం నంద్యాల జిల్లాలో జరిగింది. గ్రామానికి చెందిన కాట్రాజ్ ఈరన్న భారతమ్మ అనే గిరిజన దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో ఐదేళ్ల ధర్మ కిరణ్ అనే బాలుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పు అంటుకుంది. తల్లి బట్టలు ఉతికేందుకు బయటకు వెళ్ళింది. ఒక్కసారిగా గుడిసె నిప్పుంటుకొని భారీ పొగలు రావడం గమనించిన తల్లిదండ్రులు బంధువులు చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోపే ఘోరం జరిగిపోయింది. బాలుడు ధర్మ కిరణ్ బయటికి రాలేక సజీవ దహనం అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు వర్ణానాతీతం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్