ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కాలువగట్లు ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణల డొంక కదులుతోంది. కాలువగట్లు ఆక్రమణల గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుర్తించాలని తహశీల్దార్ కందుల కుశరాజు సూచించారు. ఆలమూరు రెవెన్యూ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, నీటి సంఘాల ప్రతి నిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామంలోను కాలువగట్లను ఆక్రమణను పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగా నోటీసులు అందించాలన్నారు. అలాగే వారిపై తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయ పరుచుకుని ఆక్రమణలు గుర్తింపు చర్యలు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో గుర్తింపు పూర్తి చేసామని తెలుపగా, మిగిలిన కాలువలపై ఉన్న ఆక్రమణలను పేర్లుతో గుర్తించి వారికి ఇరిగేషన్ శాఖ ద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ సమీక్షలో ఆలమూరు డీసీ చైర్మన్ మెర్ల గోపాలస్వామి, ఆలమూరు, చింతలూరు సాగు నీటి సంఘాల అధ్యక్షులు వైట్ల గంగరాజు, గారపాటి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ వక్కపట్ల లక్ష్మణరావు, మండల సర్వేయర్ ప్రభావతి, ఇరిగేషన్ ఏఈ కృష్ణత్రిమూర్తులు, పలువురు వీఆర్వోలు, గ్రామసర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కాలువగట్లు ఆక్రమణకు ప్రత్యేక చర్యలు : తహసీల్దార్ కుశరాజు
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)