మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏకగ్రీవ సర్పంచ్ చినబాబును అభినందించిన టీడీపీ నాయకులు

19 నిమిషాల క్రితం

TDP leaders congratulate unanimously elected Sarpanch Chinababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని పెనికేరు గ్రామ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైన ఈదర శ్రీరామచంద్రమూర్తి (చినబాబు)ను మంగళవారం మడికి తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పంపన అంజిబాబు, ఈదర రమేష్, మల్యాల రాజేష్‌లు శాలువాతో ఘనంగా సత్కరించి, ఇండోర్ ప్లాంట్ బహూకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న పెనికేరు ప్రజల తీరు ఎంతో అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చినబాబు చేస్తున్న విశేషమైన కృషిని, ప్రజలతో ఆయనకున్న అనుబంధం, నమ్మకానికి ఈ ఏకగ్రీవ నిర్ణయం నిదర్శనమని పేర్కొన్నారు. చినబాబు గ్రామాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న సేవలకు, కృషికి గ్రామస్తులు అందించిన గొప్ప కానుకగా ఈ విజయాన్ని అభివర్ణించారు. రానున్న రోజుల్లో చినబాబు నాయకత్వంలో పెనికేరు గ్రామం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా చిన్నబాబు అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్