ప్రజాశక్తి - ఆలమూరు : కపిలేశ్వరపురంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి టిడిపి మండల కార్యదర్శి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు సలాది నాగేశ్వరరావులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి సలాది అభివందనం చేసి ఆశీస్సులు పొందారు. గతం నుండి వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావుతో పాటు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ, తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ, తదితర ప్రముఖులు ఉన్నారు
మెగాస్టార్ చిరంజీవిని కలసిన టిడిపి మండల కార్యదర్శి సలాది
11 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)