ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని బివి లంక దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కానుకుల హుండీ చోరీ జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆలయం గేట్ల తాళాలు పగలగొట్టి ఆలయంలోపలకు వెళ్లి, సీసీ కెమెరా ఉందని గమనించి ముసుగు వేసుకుని అంతరాలయంలోకి ప్రవేశించాడన్నారు. ఈ క్రమంలో గెడ్డ పార వినియోగించి అమ్మవారి కానుకుల హుండీని దొంగిలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఆలయ నిర్వాహకులు దృశ్యాల్లో దొంగ ఆలయం లోనికి ప్రవేశించిన విధానాన్ని పోలీసులకు వివరించారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వాహకులతో కలిసి స్థానిక నేత దూలం రాంబాబు, తదితరులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టినట్లు ఎస్సై జి.నరేష్ తెలిపారు.
బివి లంక దుర్గమ్మ ఆలయంలో కానుకుల హుండీ చోరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)