ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : వీఆర్ఏ ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలని కోరుతూ వీఆర్ఏ లు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం 7వ రోజుకు చేరుకుంది. అమలాపురం హైస్కూల్ సెంటర్ నందు అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాలకు చెందిన వీఆర్ఏ లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏ లు తమ ప్రధాన సమస్యలైన జీతభత్యాల పెంపు, పే స్కేల్ అమలు, పదోన్నతులు, నామినేషన్ ద్వారా వీఆర్ఏ ల నియామకం తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు కి వీఆర్ఏ ల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించి, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మొగలికుదురు లక్ష్మణరావు, సత్యనారాయణ, రంజీ, విజయ్, ప్రసాంత్, దుర్గ ప్రసాద్, మంగ తదితరులు పాల్గొన్నారు.
7వ రోజుకు చేరిన వీఆర్ఏ ల నిరసన
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)