బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్ 2 విశాఖలో "సత్యాగ్రహ దీక్ష" జయప్రదం చేయండి : జేఏసీ

1 గంట క్రితం

manyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 02:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- గుమ్మలక్మిపురం : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాలు, సంస్థలలో పనిచేస్తున్న సుమారు మూడు లక్షల 50 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు ఏ పోలినాయుడు, కోశాధికారి ఏ దివాకర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ బి వి రమణ డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 విశాఖలో నిర్వహించే సత్యాగ్రహ దీక్ష జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గుమ్మలక్ష్మిపురం మండలం లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ , డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నప్పటికీ ఏపిలో ఆదిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ హక్కుగా కల్పించబడిన జీవో 24 రద్దుచేసి ఉద్యోగులకు తీవ్రమైన నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. మినిమం స్కేల్ పరిరక్షణకు, కాంట్రాక్ట్ ఔట్సోర్టు ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చే జీవో నెంబర్ 2 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యున్నతమైన విద్యను అభ్యసించిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ అవ్వక, జీతాలు చాలక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె శిబిరాల వద్దకు వచ్చి నేటి కూటమి నేతలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ,ఆ హామీని అమలు చేసేందుకు నేటికి చర్యలు చేపట్టకపోవడం సరైన విధానం కాదని అన్నారు. తక్షణమే ఆ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా అక్టోబర్ 2వ తేదీన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నామని, ఈ దీక్షలో పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థలు, సొసైటీలలో పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెంట్, ఉద్యోగులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి గోవర్ధన్,జి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్