ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం బక్కునాయుడుపేట వద్ద గల బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల వసతి గృహం లో చదువుతున్న విద్యార్థులు సుమారు550 మంది చదువుతున్నారు ప్రశాంతంగా ఉన్న వాతావరణం లో ఈ వసతి గృహం నిర్మించడం జరిగింది ప్రభుత్వం అన్ని బాగానే ఉన్నా విద్యార్థులు భోజనం చేసే డైనింగ్ హాలుకు మాత్రం కిటికీలు కు తలపులులేక పోవడము వలన.ఈగలు, ప్రవేశించి ఆహార పదార్థాలు పై వాలుతున్న ఆహారాన్ని తింటున్నారు . ఇటువంటి ఆహారం తింటున్నప్పుడు విద్యార్థులు ఎలా ఆరోగ్యవంతంగా ఉంటారు జిల్లా అధికారులు పర్యటిస్తారు వస్తారు వెళ్తారు సదుపాయాలు మాత్రం కల్పించరు పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశిస్తారు . ఉచిత సలహాలు ఎవడో వలన విద్యార్థులకు ప్రయోజనం లేదు పిల్లలు భోజనం చేసే డైనింగ్ హాలుకు మెస్సు , కిటికీలకు రెక్కలు అదేవిధంగా పినాయిల్ కూడా సప్లై చేస్తే బాగుంటుందని అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కలుగుతాయని పేరెంట్స్ అందరూ అధికారులను కోరుతున్నారు.
విద్యార్థులు బోధన హాలు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉంటారు ?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)