ప్రజాశక్తి - ఆలమూరు : జక్కంపూడి రామ్మోహన్రావు 15వ వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. మండలంలోని జొన్నాడలో గొలుగూరి సూర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. జక్కంపూడి రామ్మోహన్రావు నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ జన నేతగా అందరి మన్ననలు పొందారన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండే జక్కంపూడి పోరాట యోధుడిగా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆయన మార్గం మనందరికీ అనుసరణీయమని, పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షుడు తమ్మన శ్రీనివాసు, ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి (దొరబాబు), కర్రి నాగిరెడ్డి, చల్లా ప్రభాకరరావు, నాండ్ర నాగమోహన్ రెడ్డి, నెక్కింటి వెంకటరాయుడు (బుజ్జి), గొలుగూరి సూర్రెడ్డి, తోరాటి లక్ష్మణరావు, గుణ్ణం రాంబాబు, దియ్యన పెద్దకాపు, తోరాటి రాంబాబు, ఆకుల సాయి వరప్రసాద్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జక్కంపూడి వర్ధంతికి వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల ఘన నివాళి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)